అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

  • అనంతపురం జిల్లా రేకులకుంట వద్ద కారును ఢీకొన్న లారీ
  • మృతి చెందిన నలుగురు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ వాసులుగా గుర్తింపు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పల వైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు .. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road Accident
Anantapur District
Crime News

More Telugu News